Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleMuluguNalgondaPoliticsSpecial ArticlesSpot NewsTelanganaWomenYouth

‘అగ్నివీర్’ ఎంపికలకు దరఖాస్తు చేసుకోండి

‘అగ్నివీర్’ ఎంపికలకు దరఖాస్తు చేసుకోండి

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 24)

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువకులు ‘అగ్నివీర్ ఎంపికల ప్రక్రియ’ కోసం తెలంగాణాకు చెందిన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సికిందరాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసర్  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2025 – 2026 నియామక సంవత్సరానికి “అగ్నివీర్” ఎంపిక పరీక్ష జరుగుతుందని తెలిపారు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 12 నుంచి ఏప్రిల్ 10 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. పేర్ల నమోదు కోసం అధికారిక వెబ్ సైట్ www.joinindianarmy.nic.in ను  నిరుద్యోగ అవివాహిత యువకులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధికల్పనశాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ సోమవారం  తెలియజేశారు.

Related posts

టీటీ బాలబాలికల టీం ఛాంపియన్స్ హైదరాబాద్

Divitimedia

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతను ప్రశంసించిన కలెక్టర్

Divitimedia

కమ్యూనిస్టులకు ‘చెయ్యిచ్చిన’ కారు ఓనరు

Divitimedia

Leave a Comment