Divitimedia
Andhra PradeshInternational NewsLife StyleNational NewsSpot NewsTelanganaTravel And Tourism

వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ప్రత్యేక చర్యలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ప్రత్యేక చర్యలు

TTD gearing up for V Darshan

జనవరి 10 నుండి 19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు

✍️ తిరుమల-తిరుపతి – దివిటీ (డిసెంబరు 15)

శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు

  • దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.
  • చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.
  • ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు.
  • భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు.
  • గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.
  • భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.
  • మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు.
  • 3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది.

Tirumala, TTD has began making elaborate arrangements for Vaikuntha Dwara Darshan at Tirumala Temple from January 10 to 19 next year to celebrate Vaikuntha Ekadasi, one of the most important religious events of Srivari Temple. In this context, TTD has taken some decisions giving priority to common devotees to have Vaikuntha Dwara Darshan.

Some of the important decisions taken by TTD in the context of Vaikuntha Dwara Darshan

  • Only devotees with darshan tokens/tickets are allowed for darshan. Devotees without tokens will be allowed to Tirumala but not allowed for darshan.
  • Privilege darshans including Parents with infants, Aged and Physically disabled, defense, NRI darshans stands canceled during these ten days.
  • VIP break darshans are canceled for 10 days except for protocol celebrities.
  • Allow the maximum number of devotees to have Vaikuntha Dwara Darshan by reducing queue lines
  • There will be no special darshan arrangements for devotees wearing Govinda Malas. Only devotees with darshan tokens/tickets are allowed for darshan.
  • Devotees are advised to reach the queues according to the allotted time slots on their tokens or tickets to avoid waiting.
  • Ex-MPs, Ex-Bureaucrats, Ex-Chairmen of TTD are not allowed for Dwara darshan on Vaikuntha Ekadasi. From January 11 to 19 they are allowed for darshan.
  • The services of 3000 young Srivari Sevaks besides scouts & guides will be utilized for the management of queues during these ten days.

Devotees are requested to keep the above points in mind and cooperate with TTD.

Related posts

ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్ల అరెస్టు

Divitimedia

కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న అసంతృప్త నేతలు

Divitimedia

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

Divitimedia

Leave a Comment