‘యూఆర్ఎస్’ను సందర్శించిన ఎంఈఓ
✍️ కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 12)
కొత్తగూడెం మున్సిపాలిటీలో గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను మండల విద్యా శాఖాధికారి ప్రభుదయాల్ గురువారం సందర్శించారు. ఈ ప్రత్యేక పాఠశాలను కేవలం అవసరం ఉన్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నందున పాఠశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని నిర్వాహకులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంట్న్నందున అదే రీతిలో ప్రతి ఒక్కరూ ఆ విద్యార్థుల సంక్షేమం కోసం పని చేయాలన్నారు. అవసరం ఉన్న విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేళ్లు అందజేసి, చక్కగా చదువుకోవాలని సూచించారు.