Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelangana

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణచర్యలు తప్పవు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణచర్యలు తప్పవు

కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు

నేరసమీక్ష సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 26)

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పెండింగులోని కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులతో మంగళవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్క కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణచర్యలు తప్పవన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నిషేధిత గంజాయి, పీడీఏస్ బియ్యం అక్రమరవాణా, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలై యువత అమూల్యమైన భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్ ను గుర్తించి గంజాయి రవాణా చేసే వ్యక్తులతో పాటు, గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దొంగతనం కేసుల్లో ప్రస్తుతం పోలీసుశాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని, సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదుకోల్పోయిన భాధితులు ఫిర్యాదు చేసినప్పుడు సత్వరమే స్పందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల(బ్లాక్ స్పాట్స్)ను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాదనివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగులో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేసేలా పనిచేయాలని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించ కుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుప్రమాదాలకు కారణమయ్యేవారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గడిచిన నెలలో వర్టికల్స్ వారీగా విధుల నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు డీఎస్పీలు రెహమాన్, సతీష్ కుమార్, చంద్రభాను, రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఐటీడీఏ పీఓ, కుటుంబసభ్యులు

Divitimedia

‘మినిమమ్ వేజెస్ బోర్డ్’ మెంబర్ గా యారం పిచ్చిరెడ్డి

Divitimedia

ఇందిరమ్మ మోడల్ హౌస్ కు శంకుస్థాపన చేసిన పాయం

Divitimedia

Leave a Comment