Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTechnologyTelangana

నేరాల నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలు కీలకం

నేరాల నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలు కీలకం

పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ

✍️ పాల్వంచ – దివిటీ (నవంబరు 19)

నేరాలను నియంత్రించడంలో నేరాలు ఛేదించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, జిల్లాలో ఇప్పటికే సీసీ కెమెరాల సహాయంతో చాలా నేరాలు ఛేదించామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటుచేసిన 43 సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ రికార్డులు పరిశీలించి, అక్కడ నమోదైన పలు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగులో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ పలురకాల సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు అండగా ఉండాలని తెలిపారు. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు,సమస్యాత్మక వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ వినయ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐలు సుమన్, రాఘవయ్య, జీవన్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ 

Divitimedia

రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు చేయాలి

Divitimedia

ఐసీడీఎస్ లో అధికారుల అడ్డగోలు ‘దోపిడీ’

Divitimedia

Leave a Comment