18న హైదరాబాదులో ఇండియా – మలేషియా ఫుట్ బాల్ మ్యాచ్
✍️ హైదరాబాద్ – దివిటీ (నవంబరు 14)
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 18న ఇండియా, మలేషియా దేశాల జట్ల మధ్య జరగబోయే ఫిఫా ఫుడ్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ కు సంబంధించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.