Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTechnologyTelanganaWomenYouth

పాల్వలో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

పాల్వంచలో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

✍️ పాల్వంచ – దివిటీ (నవంబరు 9)

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వనమా నగర్, హమాలి కాలనీలలో పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇందులో భాగంగా అక్కడ ప్రతి ఇంటిని సోదాచేసి, ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేసుకున్నారు. మొత్తం 250 ఇళ్లను సోదా చేయగా సరైనపత్రాల్లేని 54ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాదీనం చేసుకున్నారు. అనుమానితుల ఇళ్లలో వ్యక్తుల ఇళ్లలో పోలీస్ జాగిలం చేత సోదాలు జరిపారు. పాల్వంచ సీఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ ఏరియాలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు అందించి బాధ్యతగా వ్యవహరించాలని గ్రామస్తులకు సూచించారు. తమ తమ ఏరియాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ టౌన్ ఎస్సైలు సుమన్, జీవన్ కుమార్, పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్, ములకలపల్లి ఎస్సై రాజశేఖర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సంక్షేమ పథకాలకు ప్రత్యేకాధికారుల నియామకం

Divitimedia

సీబీసీలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

Divitimedia

విధులలో మరణించిన హోంగార్డ్స్ ఆఫీసర్స్ కుటుంబాలకు అండగా ఉంటాం

Divitimedia

Leave a Comment