Divitimedia
Crime NewsEntertainmentKhammamLife StyleSpot NewsTechnologyTelanganaYouth

ఆరడుగుల నాగుపాముని కాపాడిన స్నేక్ క్యాచర్

ఆరడుగుల నాగుపాముని కాపాడిన స్నేక్ క్యాచర్

స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణను అభినందించిన మధిరవాసులు

✍️ మధిర – దివిటీ (నవంబరు 8)

మనిషి నుంచి ముప్పుందని పాము భయపడితే, అదే పాము కాటేస్తుందేమోనని మనిషికి భయం. ఇలాంటి పరిస్థితుల్లో పాముకే ప్రాణభయం అధికం. ఖమ్మంజిల్లా మధిరలో ఈ పరిస్థితుల్లోనే ఆరడుగుల నాగుపామును తననైపుణ్యంతో కాపాడి స్థానికులందరి అభినందనలు అందుకన్నారు స్నేక్ క్యాచర్ డోర్నాల నాగరాజు. స్థానిక ప్రజలు తేలికగా ఊపిరిపీల్చుకున్న ఈ సంఘటనపై
వివరాలిలా ఉన్నాయి… మధిర పట్టణంలోని శ్రీకృష్ణుని ఆలయం వద్ద ఆరడుగుల త్రాచుపామును స్థానికులు గమనించి ఆందోళన చెందారు. వెంటనే కొందరు ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీమ్ సభ్యుడైన స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణకు సమాచారమందించారు. వెంటనే వచ్చిన రామకృష్ణ ఆ పామును బంధించి సురక్షితంగా తిరిగి అడవిలోనికి వదిలేశారు. ఈ మధ్యన తరచుగా పాములు జనావాసాల్లోకి వస్తుండగా పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పరిస్థితులలో ఎలాంటి జాతి పామునైనప్పటికీ చిటికెలో బంధించి అడవిలోకి వదిలి వేస్తూ, ఇటు ప్రజలను, అటు ఆ పాములను కాపాడుతున్న రామకృష్ణ సేవలను మధిర ప్రజలు పలువురు అభినందిస్తున్నారు.

Related posts

ప్రతి ఇంటికి త్రాగునీరందేలా చర్యలు తీసుకోవాలి

Divitimedia

‘తెలంగాణ ఎన్నికల్లో పోటీ’ గురించి ‘వైజాగ్’లో ప్రకటించిన కేఏ పాల్

Divitimedia

సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలుపరచాలి

Divitimedia

Leave a Comment