సీఎం రేవంత్ ను ‘అలయ్ బలయ్’కు ఆహ్వానించిన ‘దత్తన్న’…
కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
✍️ హైదరాబాద్ – దివిటీ (ఆగస్టు 20)
‘అలయ్ బలయ్’ అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది ప్రస్తుత హర్యానా గవర్నర్, నాటి బీజేపే సీనియర్ నేత బండారు దత్తాత్రేయ (దత్తన్న). ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అలయ్ బలయ్ వేడుక తెలంగాణ సమాజంలో ఆత్మయత, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రస్తుతం దత్తాత్రేయ హర్యానా రాష్ట్ర గవర్నర్ హోదాలో ఉన్నప్పటికీ ఆయన ‘అలయ్ బలయ్’ ను మర్చిపోకుండా సాంప్రదాయంగా నేటికీ కొనసాగించడం విశేషం. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి దత్తాత్రేయ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం స్వయంగా కలుసుకుని మరీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ‘అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రతిఏటా నిర్వహిస్తూ సంప్రదాయంగా కొనసాగిస్తున్న ‘దత్తన్న’, ఆ కార్యక్రమానికి రమ్మంటూ తనను ఆహ్వానించినందుకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలియజేశారు.