సారపాకలో రోటరీ ఇన్ భద్రా మెడికల్ క్యాంప్
✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 11)
సారపాకలో ఐటీసీ సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రైతు వేదికలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఐటీసీ సారపాక యూనిట్ హెడ్ ప్రణవ్ శర్మ, జనరల్ మేనేజర్ శ్యాంకిరణ్ అతిథులుగా పాల్గొన్నారు. తాళ్లగొమ్మూరు, కోయగూడెం ఆవాసాల ప్రజల కోసం ఈ వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఐటీసీ సంస్థ, రోటరీక్లబ్ స్థానికంగా చేస్తున్న సేవలను కొనియాడారు. మరిన్ని విస్తృతమైన సేవలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఈ మెడికల్ క్యాంపు సేవలను స్థానికులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ప్రెసిడింట్ డి.వి.ఎం. నాయుడు మాట్లాడుతూ మొత్తం వెయ్యి మంది ఈ క్యాంపులో తనిఖీ చేయించుకుని ఉచితంగా మందులు తీసుకున్నారని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామనంనారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ఎ.సాయిరామ్, సభ్యులు చెంగల్రావు, రంజిత్, డేవిడ్ ఆలివర్, శివశంకర్, ఐటీసీ డాక్టర్లు విజయకుమార్, నిఖిల్, అమృత, మెడికల్ సిబ్బంది, రోటరాక్ట్ క్లబ్ ప్రెసిడెంట్ అరవిందన్, సెక్రటరీ చైతన్య, రామకృష, ప్రవీణ్, విష్ణుప్రియ, హరిణి, హేమ, అలేఖ్య, చరణ్, మణికంఠ, ఉమ, ఢిల్లేశ్వర్ రావు, దీప్తి, కాంట్రాక్టర్లు సత్యనారాయణ, భాస్కర్ రావు, యేసోబు, బసప్ప రమేష్, వీర్రాజు, యాకూబ్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.