గిరిజన యువతికి ఐఐటీ విద్యకు ఐటీసీ బీఎంఎస్ రూ.25వేల సాయం
✍️ వాజేడు, బూర్గంపాడు – దివిటీ (జులై 30)
ములుగు జిల్లా వాజేడు మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పేద గిరిజన యువతి వాసం సుస్మిత తన ప్రతిభతో ఐఐటీలో సీట్ సంపాదించడంతో ఆమె విద్యాభ్యాసం కోసం ఐటీసీ అనుబంధ భద్రాచలం మహిళా సమితి(బీఎంఎస్) రూ.25,000 సహాయం అందించింది. ఈ మేరకు మంగళవారం నాగారంలోని సుస్మిత ఇంటికి వెళ్లిన బీఎంఎస్ ప్రతినిథులు చెక్కు రూపంలో ఆ సహాయం అందజేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్ ఐఐటీలో ప్రవేశం పొందిన వాసం సుస్మిత
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు ఆగస్టు 5వ తేదీ చివరి గడువు కావడంతో ఆమెకు ఐటీసీ బీఎంఎస్ నుంచి సకాలంలో సహాయం అందింది. కార్యక్రమంలో ఐటీసీ భద్రాచలం మహిళా సమితి అధ్యక్షురాలు కవితా కులకర్ణి, ఉపాధ్యక్షురాలు రేష్మా ప్రణవ్, కార్యదర్శి ఆల్కా ప్రఫుల్, సభ్యులు శిరీష, అంజలా, ఐటీసీ భద్రాచలం యూనిట్ అడ్మిన్ చీఫ్ మేనేజర్ చెంగల్రావు, తదితరులు పాల్గొన్నారు. బీఎంఎస్ నుంచి సుస్మితకు కొంత సహాయంతోపాటు ఐటీసీ బీఎంఎస్ ప్రతినిధులు ఆశీర్వాదాలు అందజేశారు.