Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationEntertainmentHyderabadLife StyleSpot NewsTelanganaWomen

“గ్రీవెన్స్ డే”లో బాధితులకు ఎస్పీ భరోసా

“గ్రీవెన్స్ డే”లో బాధితులకు ఎస్పీ భరోసా

ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 29)

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం, తన కార్యాలయానికి వచ్చిన భాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించి, భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 5 గురు భాదితులు ఎస్పీని స్వయంగా కలిసి తమ సమస్యలను తెలుపుకున్నారు. వారిలో ముగ్గురు భాధితులు తమ భూమిని వేరే వ్యక్తులు ఆక్రమించారని, తమకు న్యాయం చేయాలని కోరారు. తన భర్త బాగా తాగొచ్చి ఇంట్లో అందరిపైనా దాడి చేస్తున్నాడని, పోలీసు స్టేషన్లో కేసు పెట్టినా పట్టించుకోవడంలేదని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తికి ఎక్కువ మొత్తంలో బంగారం తక్కువ రేటుకి ఇస్తానని మాయమాటలు చెప్పి, డబ్బులు తీసుకుని, నకిలీ బంగారమిచ్చి మోసం చేశాడని ఫిర్యాదుచేశారు. ఈ ఐదుగురు బాధితుల ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ, వెంటనే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
—————————
సామాన్యులకు ఇబ్బందులు కలిగించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలి : ఎస్పీ రోహిత్ రాజు
——‐——————–
సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలతో నిత్యం రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బంది సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, టూటౌన్ సీఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎస్పీ

Divitimedia

గృహలక్ష్మి పథకంలో అర్హులను మాత్రమే ఎంపిక చేయాలి

Divitimedia

కిలారు కుటుంబంచే శీతల శవపేటిక వితరణ

Divitimedia

Leave a Comment