బాధ్యతలు చేపట్టిన రోటరీ ఇన్ భద్రా నూతన కార్యవర్గం
✍️ సారపాక – దివిటీ (జులై 20)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీ పీఎస్ పీడీ అనుబంధ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా 28వ కార్యవర్గ ప్రమాణస్వీకారం(ఇన్స్టాలేషన్) కళాభారతి ఆడిటోరియంలో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఐటీసీ సారపాక యూనిట్ హెడ్ ప్రణవ్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి(ఇన్స్టాలేషన్ ఆఫీసర్) గా రోటరీ డిస్ట్రిక్ట్-3150 గవర్నర్ శరత్ చౌదరి పాల్గొన్నారు. ఆయన నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ డి.వి.ఎమ్.నాయుడు, సెక్రటరీ వి.సాయిరామ్, ఇతర కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గత సంవత్సరం ఈ క్లబ్ చేసిన సేవలను గోవిందరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. గత సంవత్సరం క్లబ్ చేసి సేవలను కొనియాడిన గవర్నర్, నూతన కార్యవర్గం మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని దిశానిర్దేశం చేశారు. తనవంతు సహాయం క్లబ్బుకు ఎల్లప్పుడూ ఉంటుందని మాటిచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా, సారపాక పరిసర ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవతరగతిలో మంచి ప్రతిభ కనబర్చినన మొత్తం 87మందికి విద్యార్థినులకు స్కాలర్ షిప్పులు అందించారు. ఈ కార్యక్రమంలోనే రోటరీక్లబ్ అనుబంధ యువజన విభాగం రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం కూడా జరిగింది. ప్రెసిడెంట్ గా అరవింద్, సెక్రటరీ చైతన్య, కార్యవర్గ సభ్యులతో డిస్టిక్ట్ రోటరాక్ట్ రిప్రజెంటేటివ్ అశోక్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్-3150 పూర్వ గవర్నర్లు బి.శంకర్ రెడ్డి, మల్లాది వాసుదేవ్, డిప్యూటీ గవర్నర్ డి.సాంబశివరావు, అపిస్టెంట్ గవర్నర్ పి.భూషణ్ రావు, రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా పూర్వ ప్రెసిడెంట్లు టి.ఎస్.భాస్కరరావు పి.బి.నిరంజన్, శ్యామ్ కిరణ్, ఒ.రాజశేఖర్, చెంగల్ రావు, చాంద్ భాషా, ప్రఫుల్లకుమార్, ప్రతాప్, నవీన్, రంజితకుమార్, డేవిడ్ ఆలివర్, భద్రాచలం మహిళా సమితి ప్రతినిధులు రేష్మా శర్మ, ఆల్కా, మాధవినాయుడు, కామేశ్వరి, సుహాసిని, కాంట్రాక్టర్లు పాకాల దంర్గాప్రసాద్, యు.వి.రావు, జలగం చంద్రశేఖర్, మహేష్ రెడ్డి, యేసోబు, రఘుకుమార్, రోటరాక్ట్ క్లబ్ ప్రతినిధులు నీలి మురళి, అరుణ్ సాయి, దీపక్, ప్రవీణ్, ఉమామహేశ్వరి, రబీ పాల్గొన్నారు. ఈ
కార్యాక్రమానికి అంజుష వ్యాఖ్యాతగా వ్యవహరించారు.