Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationLife StyleSpot NewsTechnologyTelanganaYouth

డీఎస్సీ పరీక్షకేంద్రం వద్ద సెక్షన్ 163 సెక్షన్

డీఎస్సీ పరీక్షకేంద్రం వద్ద సెక్షన్ 163 సెక్షన్

కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్

✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 17)

కొత్తగూడెం జిల్లా పరిధిలో జులై 18 నుంచి ఆగష్టు 5 వరకు జరిగే డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాల వద్ద ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’లోని సెక్షన్ 163 అమలులో ఉంటుందని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ తెలిపారు. 18వ తేది నుంచి ప్రతి రోజు రెండు సెషన్లలో, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్ష సందర్బంగా ఈ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సెక్షన్ 163 అంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. పరీక్షకేంద్రానికి 200మీటర్ల దూరంవరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ఆంక్షల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. పరీక్షకేంద్రం పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకుగాను నిఘా బృందాలను నియమించి, సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాని తెలిపారు.

Related posts

ఇళ్లమధ్యలో ‘చెరువులు’… మరెవరో బాధ్యులు…?

Divitimedia

కేరళ, దక్షిణ తమిళనాడు, లక్షద్వీప్, అండమాన్-నికోబార్ దీవులకు ఉప్పెన హెచ్చరిక

Divitimedia

సంస్కృతి, సంప్రదాయాలు పాటించడంలో గిరిజనులు ఆదర్శం

Divitimedia

Leave a Comment