Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleTechnologyTelangana

గంజాయి, మత్తు పదార్థాలు గుర్తించేందుకు పోలీస్ జాగిలాలు

గంజాయి, మత్తు పదార్థాలు గుర్తించేందుకు పోలీస్ జాగిలాలు

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, కాంప్లెక్సులలో జాగిలాలతో తనిఖీలు చేస్తున్న పోలీసులు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 13)

గంజాయి, తదితర మత్తుపదార్థాలను గుర్తించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాల సేవలు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు నిషేధిత గంజాయి అక్రమ రవాణాను నిరోధించడానికి నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన రెండు పోలీస్ జాగిలాలు జిల్లాలో సేవలందించనున్నాయి. జిల్లావ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార సముదాయాల్లో నిత్యం తనిఖీలు చేసేందుకు జిల్లా డాగ్ స్క్వాడ్ లోని పోలీస్ జాగిలాలైన రీనా, గ్రేసీలు నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందినట్లు జిల్లా పోలీసుశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గంజాయి, తదితర మత్తు పదార్థాలను కనిపెట్టడంలో ఈ రెండు జాగిలాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ తెలియజేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తూ, అక్రమార్జనే ధ్యేయంగా నిషేధిత గంజాయిని రవాణాచేసే వ్యక్తులను పట్టుకోవడం కోసం వాహనాల తనిఖీలు చేపట్టడంతోపాటు పోలీస్ జాగిలాలసాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు.ఎవరైనా నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు గానీ, విక్రయిస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ రోహిత్ రాజు కోరారు.

Related posts

అంతర్రాష్ట్ర ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడేనా…?

Divitimedia

ప్రగతి విద్యానికేతన్ లో వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవం

Divitimedia

‘వైఎస్సార్ జలకళ’ బోరు పనులు పునఃప్రారంభించాలి

Divitimedia

Leave a Comment