Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationHyderabadLife StyleNational NewsSpot NewsTechnologyTelangana

కొత్త చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన అవసరం : ఎస్పీ

కొత్త చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన అవసరం : ఎస్పీ

దేశవ్యాప్తంగా జూలై 1నుంచి నూతన చట్టాల అమలు

నూతన చట్టాలపై శిక్షణ ముగింపులో ఎస్పీ రోహిత్ రాజు


✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జూన్ 25)

దేశవ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నూతన చట్టాల పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, అందుకే ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు. కొత్తచట్టాలు అమలు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆ చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. అమలులోకి వస్తున్న ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’, ‘భారతీయ సాక్ష్య అధినియం-2023’ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలమన్నారు. కొత్త చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన రావాలంటే ప్రతి ఒక్కరిలో నేర్చుకోవాలనే తపన ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరమన్నారు. అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చన్నారు. అరెస్ట్, వాంగ్మూలం నమోదులో జాగ్రత్తలు పాటిస్తూ, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించవలసిన తీరు, తదితర అంశాలపై కొత్త చట్టాలలో మార్పుల గురించి వివరించారు. భారత న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నదనీ, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాలను రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు,విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ కొత్త చట్టాలను నేర్చుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నూతన చట్టాలపై పోలీసు అధికారులకు, సిబ్బందికి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడంలో సమన్వయాధికారిగా వ్యవహరించిన డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, కొత్తగూడెం సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్షణకు సంభంధించిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ లను ఎస్పీ ఈసందర్బంగా అభినందించారు. శిక్షణనందించిన సిఐ ఇంద్రశేనారెడ్డి, ఎస్సై రాణాప్రతాప్ లను ఎస్పీ రోహిత్ రాజు సత్కరించారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, సీఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్, శివప్రసాద్, ఇంద్రశేనారెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వైద్య విద్యలో పేరు ప్రఖ్యాతులు సాధించాలి

Divitimedia

ప్రగతి విజేతలను అభినందించిన బ్రహ్మారెడ్డి

Divitimedia

Divitimedia

Leave a Comment