Divitimedia
Crime NewsHealthHyderabadKhammamLife StyleNalgondaPoliticsSpot NewsSuryapetTelanganaYouth

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

✍️ సూర్యాపేట – దివిటీ (జూన్ 23)

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మంజిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలకేంద్రంలో ఓ కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కాన్వాయిని ఆపి తన కాన్వాయిలోని ఓ వాహనంలో క్షతగాత్రున్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రజలు, క్షతగాత్రుని కుటుంబసభ్యులు ఈ సందర్భంగా మానవత్వంతో స్పందించిన మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

భారీవర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :

Divitimedia

ఆహా… ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా…?

Divitimedia

కేంద్ర బడ్జెట్ పై సారపాకలో సీపీఎం నిరసన

Divitimedia

Leave a Comment