Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamNalgondaSuryapetTelangana

ధరణి పెండింగ్ దరఖాస్తులపై ప్రభుత్వం దృష్టి

ధరణి పెండింగ్ దరఖాస్తులపై ప్రభుత్వం దృష్టి

వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశాలు

కలెక్టర్లతో సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ సమీక్ష

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 14)

ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట నల్గొండ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటిని వారం రోజుల్లో పరిష్కరించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఏఏ జిల్లాలో ఎన్నెన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి? తాజా దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? తదితర అన్ని వివరాలను సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలు పరిష్కరించేందుకు చేపట్టాల్సిన మార్గాలపై ఆయన సూచనలు చేశారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటిని వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల మాట్లాడుతూ, ఈ జిల్లాలో 3851 ధరణి సమస్యల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా పార్లమెంట్, పట్ట భద్రుల ఉపఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని వివరించారు. పెండింగ్ దరఖాస్తుల్లో 80శాతం విచారణలు పూర్తైన విషయం వివరించి, మిగిలిన 20శాతం రానున్న రెండు రోజుల్లో పూర్తిచేస్తామని తెలిపారు. వారం రోజుల్లోగా పూర్తిస్థాయిలో దరఖాస్తులను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆర్డీవోలు, తహసిల్దార్లతో ధరణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దరఖాస్తులన్నిటిని త్వరితగతిన విచారణ జరిపి నివేదికలందజేయాలని ఆదేశించారు. రానున్న వారం రోజుల్లో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో ఆర్డీఓలు మధు, దామోదర్ రావు, డీఆర్ఓ రవీంద్రనాథ్, అన్ని మండలాల తహసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related posts

గనులశాఖ అధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష

Divitimedia

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక నిఘా

Divitimedia

‘బలగం’ సింగర్ మొగిలయ్య మృతి

Divitimedia

Leave a Comment