సీఎం సభాస్థలం పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
పాల్వంచ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సతీశ్ కుమార్
✍ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 6
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఈనెల 11న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న సభాస్థలాన్ని బుధవారం జిల్లా ఎస్సీ రోహిత్ రాజు పరిశీలించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణపథకాన్ని తొలిసారి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడే ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సభ నిర్వహణ, వాహనాల పార్కింగ్ కోసం చేయాల్సిన ఏర్పాట్లు పరిశీలించి, అధికారులకు సూచనలిచ్చారు. సీఎం సభ కోసం బందోబస్తు ఏర్పాట్లపై పరిశీలన చేశారు. ఎస్పీతో పాటు పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్, సీఐ వినయ్ కుమార్, బూర్గంపాడు ఎస్సై సుమన్, పలువురు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పాల్వంచ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సతీశ్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డీఎస్పీగా సతీశ్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న వెంకటేశ్ ను ఖమ్మం స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ చేసి, హైదరాబాదు సీసీఎస్ లో ఏసీపీగా పనిచేస్తున్న సతీశ్ కుమార్ ను పాల్వంచ డీఎస్పీ గా బదిలీ చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎస్సీ రోహిత్ రాజును కలిశారు. బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ సతీశ్ కుమార్ ను సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు కలిసి స్వాగతం పలికారు. సతీశ్ కుమార్ గతంలో ఈ ప్రాంతంలో ఎస్సై, సీఐ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది.