Divitimedia
EducationHyderabadLife StyleNalgondaPoliticsSuryapetTelanganaYouth

పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు

పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు

✍🏽 దివిటీ – నల్లగొండ, హైదరాబాదు

పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెం. 46పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. ఆ జీవో నుంచి కోడ్ నెం. 24 TSSP (5000) మినహాయించాలని కోరారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, స్థానిక నిరుద్యోగుల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
CD1, CD2 ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలన్నారు. చాలా జిల్లాల్లో మిగిలిపోయిన ఖాళీలను భర్తీచేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, బాలునాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, మందుల సామ్యూల్, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Related posts

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Divitimedia

ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత గౌరవం

Divitimedia

చ‌త్తీస్‌గ‌ఢ్, తెలంగాణాల‌లో అక్టోబ‌ర్ 3న ప్ర‌ధానమంత్రి ప‌ర్య‌టన

Divitimedia

Leave a Comment