భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల రాకపోకలు నిషేధించిన పోలీసులు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ ప్రదేశాలలో రోడ్లపై నీరు చేరడం ద్వారా పోలీసులు ఆయా ప్రదేశాలలో ప్రజలు రోడ్లు దాటకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చేపడుతున్న ముందస్తు చర్యలకు ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ డా.వినీత్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బ్లాక్ అయిన రోడ్ల వివరాలు
🚫అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వాగుఒడ్డుగూడెం వద్ద వాగు రోడ్డుపై సుమారుగా 5 అడుగులపైన ప్రవహిస్తున్నది.
🚫 అశ్వరావుపేట దొంతికుంట చెరువు వరద నీరు ఇండ్లలోకి చేరినాయి.
🚫 అశ్వరావుపేట ఉట్లపల్లి గ్రామంలోకి భారీగా నీరు చేరాయి.
🚫కొత్తగూడెం నుండి పెనుబల్లి రోడ్ పై ఒక అడుగు ఎత్తులో నీరు ప్రవహిస్తున్నాయి.రాకపోకలు నిషేదించడమైనది.
🚫 దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం నుండి నాగుపల్లి వెళ్లే రోడ్డు ఆసన్నగూడెం వద్ద మల్లెపూల వాగు రోడ్డుపై 2 అడుగులు పైన నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలు నీషేదించడమైనది.
🚫 దమ్మపేట మొద్దులగూడెం వద్ద రోడ్డుపై 2 అడుగులు పైన నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలు నీషేదించడమైనది.
🚫దమ్మపేట పేరంటాల చెరువు వద్ద రోడ్డుపై 2 అడుగులు పైన నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలు నీషేదించడమైనది.
🚫దమ్మపేట గణేష్ పాడు నుండి నాచారం దగ్గర రాళ్ళ బంజర గ్రామం వద్ద రోడ్డుపై 2 అడుగులు పైన నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలు నీషేదించడమైనది.
🚫చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల చెరువు(GV మాల్) వద్ద రోడ్డుపై 2 అడుగులు పైన ప్రవహిస్తున్నందున బారికేడ్లు ఏర్పాటు చేయడమైనది.
🚫 సుజాతనగర్ మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద ఉన్న వాగు పొంగి రోడ్డుపై 1.5 అడుగులు పైన ప్రవహిస్తున్నందున రాకపోకలు నీషేదించడమైనది.
🚫జూలూరుపాడు కాకర్ల నుండి అనంతారం వెళ్లే రోడ్డుపై ఒక అడుగు పైన ప్రవాహం ఉండడంతో రాకపోకలు నిషేదించడమైనది.
🚫 జూలూరుపాడు మండలం పడమట నరసాపురం నుండి బేతాళపాడు రోడ్డులో ఒక అడుగు పైన ప్రవాహం ఉండడంతో రాకపోకలు నిషేదించడమైనది.
🚫 చంద్రగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాల్యతండా నుండి పోకలగూడెం వెళ్ళు దారిలో
0.5 అడుగు పైన ప్రవాహం ఉండడంతో రాకపోకలు నిషేదించడమైనది.
🚫 పాల్వంచ కిన్నెరసానికి భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేయడం వలన రాజాపురం నుండి యానంబైలు రహదారిపై 4 అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి.
🚫 ములకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చాపరాలపల్లి నుండి కుమ్మరిపాడు వెళ్లే దారిలో బ్రిడ్జి వద్ద రహదారిపై 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
🚫 ములకలపల్లి ముత్యాలంపాడు బ్రిడ్జి వద్ద రహదారిపై 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
🚫 అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశ్వాపురం నుండి గొందిగూడెం వెళ్ళు దారిలో ఇసుక వాగు ఉదృతి వలన రాకపోకలు నిలిచిపోయాయి