బూర్గంపాడు మహిళా సమాఖ్యకు వరికోత యంత్రం మంజూరు
అద్దె ప్రాతిపదికన రైతులు వినియోగించుకోవాలని విఙ్ఞప్తి
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
బూర్గంపాడు మండలంలో మండల మహిళా సమాఖ్యకు ప్రభుత్వం వరికోత యంత్రం మంజూరైంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఈ వరికోత యంత్రం మంజూరు చేశారు. ఈ ఖరీఫ్ సీజనులో ఈ యంత్రం లీజుకు ఇచ్చేందుకు మహిళా సమాఖ్య తీర్మానించిందని అధ్యక్షురాలు వి.మమత, ఏపీఎం మడిపల్లి నాగార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వరికోత యంత్రం లీజుకు తీసుకునేందుకు ఆసక్తి కలిగిన రైతులు నవంబరు10వ తేదీ ఉదయం 11 గంటలకు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఆ సమావేశంలోనే లీజుకు ఇవ్వడానికి అవసరమైన విధివిధానాలు, షరతులు, అద్దె, అడ్వాన్స్ వివరాలు, అగ్రిమెంట్, తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఆ సమావేశానికి హాజరైన రైతులతో చర్చించి, అధికధర(అద్దె) చెల్లించేందుకు ముందుకు వచ్చిన రైతుకు లీజుకివ్వనున్నట్లు వారు తెలిపారు. యంత్రం అద్దె షరతులు, నియమనిబంధనల విషయంలో మహిళా సమాఖ్యలదే తుది నిర్ణయమన్నారు. కాబట్టి వరికోత యంత్రం లీజుకు తీసుకునే ఆసక్తి ఉన్న మండలంలోని రైతులు, కమిషన్ ఏజెంట్లు నవంబరు 10వ తేదీన జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు.