ఐటీడీఏలో మొక్కలు నాటిన ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్
పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచన
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని, ఐటీడీఏ ప్రాంగణంలో చెత్తాచెదారాన్ని తొలగించి పరి శుభ్రంగా ఉంచుకోవాలని, పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తొలగించుకోవాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ కార్యాలయం సిబ్బందికి సూచించారు. గురువారం పీఓ ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో సిబ్బంది సహకారంతో స్వయంగా మొక్కలు నాటి, నీరందించారు. హరితహారంలో భాగంగా నీడ, పండ్లనిచ్చే, పూలు పూసే మొక్కలు నాటి సంరక్షించుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, డీటీఆర్ఓఎఫ్ఆర్ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ, హార్టికల్చర్ చిట్టి బాబు, ఐటీడీఏ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.