పినపాకకు వజ్జా శ్యామ్, భద్రాచలం ఇర్పా రవికుమార్… బీయస్పీ అభ్యర్థులుగా ఖరారు
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం, మణుగూరు
బహుజన సమాజ్ పార్టీ (బీయస్పీ) నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సోమవారం ప్రకటించారు. పార్టీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేయడంతో జిల్లా ఉపాధ్యక్షుడు కె.వి.రమణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సారపాకలో సెంటర్లో బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఇరపా రవికుమార్, పినపాక నియోజకవర్గం అభ్యర్థిగా వజ్జా శ్యామ్ లను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రవీణ్ కుమార్ కు బహుమతిగా ఇస్తామని అభ్యర్థులు శ్యామ్, రవికుమార్, బీఎస్పీ నాయకులు ప్రకటించారు.