బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర రైలు ప్రమాదం
పరస్పరం ఢీకొన్న రెండు రైళ్లు, 20 మంది మృతి
✍🏽 దివిటీ మీడియా – ఆన్ లైన్
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం (అక్టోబరు 23వ తేది) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఆ దుర్ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. రెండు రైళ్లు పరస్పరం ఢీకొనడంతో పలు భోగీలు తుక్కుతుక్కయ్యాయి. ఘోరమైన ప్రమాదం జరగడంతో దుర్ఘటనాస్థలంలో భీతావహపరిస్థితులు దర్శనమిస్తున్నాయి. స్థానికులు పెద్ద సంఖ్యలో దుర్ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.