తెలంగాణ సౌత్ జోన్ సబ్ జూనియర్ బాలుర హాకీజట్టు కోచ్ గా నిఖిల్
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
తమిళనాడులో అక్టోబరు 17నుంచి 24వ తేదీ వరకు జరుగుతున్న హాకీ ఇండియా మొదటి సబ్ జూనియర్స్ సౌత్ జోన్, జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ బాలుర హాకీ జట్టుకు నిఖిల్ కోచ్‌గా వ్యవహరించ బోతున్నారు. ఈ మేరకు తెలంగాణ హాకీ సమాఖ్య నుంచి ఆదేశాలందాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ క్రీడాకారునిగా చిరపరిచితుడైన నిఖిల్, ఉమ్మడి జిల్లాలో హాకీ క్రీడలో ఎన్ఐఎస్ పూర్తి చేసిన, హాకీ ఇండియా తరపున లెవల్ 1 పరీక్ష పాసైన ఏకైక క్రీడాకారునిగా గుర్తింపు సాధించాడు. సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టుకు కోచ్ గా నిఖిల్ ఎంపికవడం పట్ల హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, కోచ్ ఇమామ్, సలీంఖాన్, రాజ్ కుమార్, కృష్ణవేణి, సీనియర్ క్రీడాకారులు ఈమంది గణేష్, తదితరులు తెలిపారు.