Divitimedia
Spot News

అనుమతి పొందిన తర్వాతే ప్రచార సామగ్రి ముద్రించాలి

అనుమతి పొందిన తర్వాతే ప్రచార సామగ్రి ముద్రించాలి

ఎంసీఎంసీ నోడల్ అధికారి శ్రీనివాసరావు

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

అనుమతి పొందిన తర్వాతే ఎన్నికల ప్రచార సామగ్రి ముద్రించాలని జిల్లా పౌర సంబంధాల అధికారి, ఎంసీఎంసీ నోడల్ అధికారి శ్రీనివాసరావు పారు. ఐడీఓసీ
కార్యాలయంలోని మీడియా కేంద్రంలో ఆయన మంగళవారం ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రచారానికి ముద్రించే కరపత్రాలు, పోస్టర్లు, తదితర అంశాల్లో తీసుకోవాల్సిన అనుమతులపై ఆయన ప్రింటింగ్ ప్రెస్సుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నియమ నిబంధనలు మేరకు ప్రతి ముద్రణకు ముందు తప్పకుండా అనుమతి పొందాలని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి వినియోగించే కరపత్రాలు, పోస్టర్ల వంటి ప్రతి ప్రచార సామగ్రి ముద్రణకు ముందుగా భారత ఎన్నికల సంఘం నిబంధనలలోని సెక్షన్-127 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ప్రచురణ కోసం ఇద్దరు వ్యక్తులు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పారు. ముద్రించే ప్రతులపై ఆ ముద్రణసంస్థ పేరు, సెల్ నెంబరుతోపాటు ముద్రించిన కాపీల సంఖ్య, ప్రచురణ కర్తల పేరు తెలియజేయాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ప్రచార ప్రతులు ముద్రిస్తే ఎన్నికలసంఘం నిబంధనల ప్రకారం చర్యలుంటాయని స్పష్టంచేశారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారానికై ముద్రించే ముద్రణలలో వివాదాస్పద వాఖ్యలు కానీ, ఇతరులను కించపరిచే అంశాలుగానీ, కుల, మతాల ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండరాదని చెప్పారు. ఎన్నికల సంఘం ఆదేశాలన ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. ప్రచారానికి వినియోగించే ముందుగానే 4 ప్రతులు తమకు అందజేయాలని చెప్పారు. అనుమతి పొందిన తర్వాతనే ప్రచారంలో వినియోగించుకోవాలన్నారు. ముద్రణలో క్లెయిము కోసం బిల్లులు సాధారణ పేపర్ పై ఇవ్వరాదని, సంస్థ బిల్ ప్రతిపైన మాత్రమే ఇవ్వాలని, రూ.20 వేలు దాటితే ఎన్నికల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించనివారికి 2 వేల రూపాయల జరిమానా గానీ, 6 నెలల వరకు జైలుశిక్ష గానీ, లేదంటే ఆ రెండుగానీ అమలు చేసే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ నియంత్రణ అధికారి, సహకార అధికారి వెంకటేశ్వర్లు, ప్రింటర్లు పాటించాల్సిన నియమాల గురించి వివరించారు.

Related posts

ఎస్పీ కార్యాలయంలోనూ ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

Divitimedia

సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పర్యటన

Divitimedia

తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్ గా వెన్నెల

Divitimedia

Leave a Comment