మోరంపల్లిబంజరలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిక
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామంలో దాదాపు 45 కుటుంబాలకు చెందినవారు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. వారికి గులాబీ కండువాలు కప్పిన తెలంగాణ ప్రభుత్వవిప్ రేగా కాంతారావు, పార్టీలోకి ఆహ్వానించి, చేరిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నదని, ఆ పథకాలే మూడోసారి గెలిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు మేడం లక్ష్మీనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, గాదె నర్సిరెడ్డి, బత్తుల రామకొండారెడ్డి, రాంరెడ్డి, ఎక్కంటి శ్రీనివాస్ రెడ్డి, మూల బాలి రెడ్డి, గడ్డం సతీష్, మేడం రామిరెడ్డి, గాదె నర్సిరెడ్డి, బి. శ్రీనివాసరావు, నాని, పూర్ణచందర్, కైపు నాగిరెడ్డి, గంటా రమేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.