పాఠశాల విద్య కొత్తగూడెం మండల నోడల్ అధికారిగా డాక్టర్ దయాల్
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
పాఠశాల విద్య కొత్తగూడెం మండల నోడల్ అధికారిగా రామవరం ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ ప్రభుదయాల్ నియమితులయ్యారు. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన విద్యా కార్యక్రమం తొలిమెట్టు (ఎఫ్.ఎల్.ఎన్), ఉన్నత పాఠశాలల్లో ఉన్నతి (ఎల్.ఐ.పి) విద్యా కార్యక్రమం నిర్వహణ- ప్రగతితోపాటు పదవ తరగతి విద్యార్థులకై ప్రత్యేక “లక్ష్య” కార్యక్రమాల నిర్వహణలపై పరిశీలన, విద్యాపరమైన సూచనలు, సలహాలకు ఆయన మండల బాధ్యులుగా ఉంటారు. గతంలో మధిర మండల నోడల్ అధికారిగా పనిచేసిన ఆయన ఆ మండలంలో విద్యాపరంగా జిల్లాలో ప్రగతిపథంలో ఉంచి జిల్లా కలెక్టర్, విద్యాశాఖ కార్యదర్శుల నుంచి ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేయడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.