ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్, యోగా ఎంపికలు
✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి అండర్-17 వాలీబాల్ బాలబాలికల జిల్లాజట్లతోపాటు, అండర్-14, అండర్-17 బాల బాలికల యోగా జిల్లా జట్ల ఎంపికలు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అక్టోబరు13న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) వెంకటేశ్వరచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 9వ, 10వ తరగతులతోపాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, 2007 జనవరి 1వ తేదీ తరువాత జన్మించినవారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అండర్-14 ఎంపికల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులు 2010 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారు అర్హులని వెల్లడించారు. ఎంపికలలో పాల్గొనే క్రీడాకారులు తమతోపాటుగా స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న క్రీడాకారులు తమ 10వ తరగతి మెమో, తాము చదువుతున్న కాలేజీ నుంచి స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వచ్చిన వారిని మాత్రమే ఈ ఎంపికలకు అనుమతించనున్నట్లు వివరించారు. ఈ ఎంపికల నిర్వాహణ బాధ్యతలను ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ఆదేశాల మేరకు పీడీ కె.నరసింహమూర్తికి అప్పగించారని వెల్లడించారు. ఉమ్మడిజిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఈ ఎంపికలలో పాల్గొనే క్రీడాకారులను సిద్దంచేయాలని, ఈ ఎంపికల ప్రక్రియలో పీఈటీలు, పీడీలందరు పాల్గొని త్వరలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టును
పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహక కార్యదర్శి టి స్టెల్లా ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా కోరారు.