ప్రాథమిక పాఠశాలను సందర్శించిన క్లస్టర్ నోడల్ అధికారి
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరం ఏరియాలో 2 ఇంక్లైన్ ప్రభుత్వ పాఠశాలను క్లస్టర్ నోడల్ అధికారి డాక్టర్ దయాళ్ గురువారం సందర్శించారు. విద్యాభివృద్ధికి అవసరమైన పలు సలహాలు, సూచనలు అందించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తూ ప్రతిభచూపిన బాలురకు ప్రోత్సాహకరంగా ఆయన నూతన దుస్తులు బహూకరించారు.