Divitimedia
Bhadradri KothagudemCrime NewsTelanganaWomen

హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవికి అధికారికంగా అంత్యక్రియలు

హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవికి అధికారికంగా అంత్యక్రియలు

శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ డా.వినీత్, ఉన్నతాధికారులు

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాచలంలో శనివారం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి ప్రాణాలు కోల్పోయిన కొత్తగూడెం వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి భౌతికకాయానికి ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. శ్రీదేవి భౌతికకాయానికి జిల్లా ఎస్పీ డా.వినీత్, ఎస్పీ సతీమణి ప్రీతి, ఓఎస్డీ టి.సాయిమనోహర్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, జిల్లాకు చెందిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సాయం కింద ఎస్పీ తమ వ్యక్తిగతంగా రూ.1లక్ష శ్రీదేవి కుటుంబసభ్యులకు అందజేశారు. పోలీస్ అధికారుల అసోసియేషన్ తరపున రూ.20,000 దహనసంస్కారాల నిమిత్తం అందించారు. 1995 బ్యాచ్ నకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీదేవి మంచి పోలీసు అధికారి అని, ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్, భద్రాచలం టౌన్, కొత్తగూడెం 2టౌన్, పోలీస్ కంట్రోల్ రూమ్, కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్లలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. ఆమె మరణం జిల్లా పోలీసుశాఖకు తీరని లోటని పేర్కొన్నారు. జిల్లాలో పోలీసుశాఖకు ఆమె అందించిన సేవలు అనిర్వచనీయమన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్దసంఖ్యలో పాల్గొని శ్రీదేవి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

Related posts

ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును జాబితాలో పరిశీలించుకోవాలి

Divitimedia

అటవీ సంరక్షణ, ఎల్.డబ్ల్యు.ఇ ప్రాంతాల అభివృద్ధిలో సమతూకం లక్ష్యంగా…

Divitimedia

భద్రాచలం గిరిజన గురుకులానికి పతకాల పంట…

Divitimedia

Leave a Comment