ఆసియన్ గేమ్స్ లో నాలుగో ర్యాంకులో భారత్
✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం
ఆసియన్ గేమ్స్ లో భారత్ శుక్రవారం నాటికి నాలుగోస్థానంలో నిలిచింది. భారత క్రీడాకారులు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 33కి చేరుకుంది. ఇందులో 8 స్వర్ణ పతకాలు, 12 రజత పతకాలు, 13 కాంస్య పతకాలున్నాయి. చైనా మొదటిస్థానంలో ఉండగా, జపాన్ రెండోస్థానంలో, కొరియా మూడోస్థానంలో ఉన్నాయి. ఆసియన్ గేమ్స్ పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్ 4వ స్థానంలో ఉంది. భారత క్రీడాకారులు మరిన్ని పతకాలతో దేశాన్ని మెరుగైన స్థానంలో నిలబెట్టాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.