Divitimedia
NalgondaTelangana

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి : వంగూరి దామోదర్

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి : వంగూరి దామోదర్

✍🏽 దివిటీ మీడియా – సూర్యాపేట

సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఫనిగిరి స్టేజీ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు టెక్నో డిడ్ ఐటీ కంపెనీ చైర్మన్ వంగూరి దామోదర్ శుక్రవారం రూ.20 వేలు విరాళం అందించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని కార్యక్రమం నిర్వాహకులు బుక్కరాజు తిరుపతికి అందజేశారు. ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. సమాజంలోని అందరి మంచి కోసం జీవితమంతా ఎంతో కష్టపడి భారత రాజ్యాంగం రాసి, దేశానికి అంకితం ఇచ్చిన అంబేద్కర్ విగ్రహానికి తనవంతుగా ఆర్థికసహాయం అందజేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న అంటరానితనం లేని, అసమానతలు, వివక్ష లేని, మానవత్వంతో కూడుకున్న సమాజం ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. గ్రామగ్రామాన అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బుక్కరాజు తిరుపతి, తిగుళ్ల నరసయ్య, గంట సోమిరెడ్డి, వంగూరి సోమయ్య, వంగూరి అబ్బులు, ఎలా పాపయ్య, వంగూరి వెంకటయ్య, పేరాల గోపి, వంగూరి సందీప్, తిగుళ్ల శేఖర్, బోడ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ ఎన్నికల్లో అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం

Divitimedia

ఓటరు జాబితాలో ఓటు పరిశీలించుకోండి : కలెక్టర్ డా.ప్రియాంకఅల

Divitimedia

రోటరీ నిధులు 30 లక్షలు వెనుకకు వెళ్ళిపోతాయి

Divitimedia

Leave a Comment