Divitimedia
Bhadradri KothagudemEducationTelangana

బ్రిలియంట్ లో ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం

బ్రిలియంట్ లో ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం

✍🏽 దివిటీ మీడియా – సారపాక

సారపాకలోని బ్రిలియంట్ విద్యాసంస్థల్లో  ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి విద్యాసంస్థల అధినేత బి నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులతో స్వయంపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయపాత్రలను విద్యార్థులు చక్కగా పోషించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మండలంలో విశేష సేవలు అందించిన ఉపాధ్యాయులు జె.సుదర్శన్, జి.గోపాల్ రావు లను ఘనంగా సత్కారం చేశారు. బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బి నాగేశ్వరరావు చేతులమీదుగా సత్కారం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. సత్కార గ్రహీత వేణుగోపాలరావు మాట్లాడుతూ, ఒకప్పుడు సాధారణమైన ఉపాధ్యాయుడి స్థాయి నుంచి నేడు విద్యాసంస్థల అధినేత స్థాయికి ఎదిగి ఎందరికో జీవనాధారంగా ఉన్నారన్నారు. పలువురికి జీవనాధారం  కల్పించడమే కాక, అందరికీ మార్గదర్శకంగా ఎదగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.  బినాగేశ్వరరావు మాట్లాడుతూ, పవిత్రమైన  ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం తనకెంతో ఆనందం కలిగించిందన్నారు. తన చేతుల మీదుగా ఎందరో విద్యార్థులు వివిధ రకాల  వృత్తుల్లో స్థిరపడటం గర్వంగా ఉందన్నారు.  ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన  ఫలితాలలో తమ విద్యార్థిని పల్లి భాగ్యశ్రీ ఎస్సైగా ఎంపికవడం తనకెంతో  గర్వంగా ఉందని గుర్తు చేసుకున్నారు.  అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని  విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. ఈ  కార్యక్రమంలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఆటల పోటీలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

భగవాన్ దాస్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ అన్నప్రసాద వితరణ

Divitimedia

హాస్టల్ సమస్యలు చూసి ఆగ్రహించిన కలెక్టర్

Divitimedia

పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

Divitimedia

Leave a Comment