Divitimedia
Bhadradri KothagudemPoliticsTelangana

కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలో రూ.75.25 కోట్లతో చేపట్టనున్న 139 పనులు, పాల్వంచ మున్సిపాల్టీలోని నవభారత్ లో రూ.60 కోట్లతో చేపట్టనున్న 268 పనులకు శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో భాగస్వాములైన పట్టణ పాలకవర్గాన్ని మంత్రి అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రత్యేకంగా వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారని చెప్పారు. కొత్తగూడెం-పాల్వంచ పట్టణాలు హైదరాబాదు- సికింద్రాబాదు జంటనగరాల లాగా విరాజిల్లే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 75 సంవత్సరాల దేశ చరిత్రలోనే రూ.135కోట్లతో ఇంత పెద్దఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన దాఖలాలు లేవని, నేడు ఇదొక చరిత్ర అని చెప్పారు. ఒకపుడు కొత్తగూడెం ఏ విధంగా ఉండేదో, నేడు ఎలా ఉందో చూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు తెలిపారు. కిన్నెరసాని నదీ జలాలు, మున్సిపాల్టీలలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజి మౌలికసదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారన్నారు. అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజేందర్, జడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, ఆర్.అండ్.బి ఇఇ భీమ్లా, పంచాయతీరాజ్ ఇఇ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అవినీతి వ్యతిరేక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

Divitimedia

“మన కలపరాజులు” పుస్తకం ఆవిష్కరించిన మంత్రి తుమ్మల

Divitimedia

గ్రూప్-3 పరీక్షల్లో మెహందీ, టాటూలు నిషిద్దం

Divitimedia

Leave a Comment