Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadPoliticsSpot NewsTelanganaYouth

సీఎంను జిల్లా పర్యటనకు ఆహ్వానించిన తుమ్మల

సీఎంను జిల్లా పర్యటనకు ఆహ్వానించిన తుమ్మల

డిసెంబర్ మొదటివారంలో పర్యటనకు ఏర్పాట్లు

✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (18 నవంబరు)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల కలిసి జిల్లా పర్యటనకు ఆహ్వానించగా, సీఎం సానుకూలంగా స్పందించారు. డిసెంబర్ మొదటివారంలో జిల్లా పర్యటనకు సీఎం అంగీకరించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల, విద్యాశాఖ కార్యదర్శి శ్రీధర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులకు ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Related posts

పార్ట్ టైం ఫ్యాకల్టీగా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

Divitimedia

అపరిశుభ్రత, దుర్గంధంతో అంగన్ వాడీ కేంద్రాలు

Divitimedia

గంజాయి కోసం లారీలో సీక్రెట్ ఛాంబర్

Divitimedia

Leave a Comment