Divitimedia
Crime NewsHyderabadNational NewsSpot NewsTelanganaTravel And TourismWomenYouth

హజ్ యాత్రలో హైదరాబాద్ మృతులు 45మంది

హజ్ యాత్రలో హైదరాబాద్ మృతులు 45మంది

వివరాలు వెల్లడించిన జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్

✍️ దివిటీ – హైదరాబాద్(17 నవంబరు)

హైదరాబాదు నుంచి హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 45మంది ప్రమాదంలో మరణించారని జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి నాలుగు ఏజెన్సీల ద్వారా మొత్తం 54 మంది హజ్ యాత్రకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. వారిలో 46 మంది బస్సులో వెళ్లగా, నలుగురు కారులో వెళ్లారని, మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారని వివరించారు. బస్సులో వెళ్లిన 46మందిలో 45 మంది చనిపోగా, షోయబ్ అనే ఒక్క యువకుడే ప్రాణాలతో బయటపడ్డాడని పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో 18 మంది మహిళలు, 18 మంది పురుషులు, 10మంది చిన్నారులున్నట్లు తెలిసిందన్నారు. ప్రాణాలతో బయటపడ్డ షోయబ్ పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందని, బాధితులు ఏ ఆసుపత్రిలో ఉన్నారో చెక్ చేస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.

TafseerIqbal #SaudiArabia #BusFireAccident #SaudiBusAccident

Related posts

వరుసగా బయటపడుతున్న ఐకేపీ అక్రమాలు…

Divitimedia

ప్రజావసరాలకోసం భూసమస్యల పరిష్కారానికి భూసర్వే

Divitimedia

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Divitimedia

Leave a Comment