సీఎం సహాయనిధికి భద్రకాళి ప్రొడక్షన్స్ విరాళం
✍️ దివిటీ (హైదరాబాద్) ఆగస్టు 29
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భద్రకాళి ప్రొడక్షన్స్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని శుక్రవారం భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి చెక్కును అందజేశారు.