కొత్తగూడెంలో ఘనంగా టీఎల్ఎం ప్రదర్శన
✍️ కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 19)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మంగళవారం మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రదర్శన స్థానిక హనుమాన్ బస్తి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం మండలం
పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా తయారుచేసిన ఈ బోధన ఉపకరణాలు (మెటీరియల్) పలువురిని ఆకట్టుకుంది. ఇక్కడ ఎంపిక చేసిన ఉత్తమ మెటీరియల్ జిల్లా స్థాయి ప్రదర్శనకు పంపనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభుదయాల్ తెలిపారు. ఇలాంటి మెటీరియల్ వల్ల సృజనాత్మకత చోటు చేసుకోవడంతో పాటు అందులోని విషయం అత్యంత సులభంగా అర్థమవుతూ, కలకాలం జ్ఞాపకంలో నిలుస్తుందన్నారు. పాఠాలు చెప్పడం గొప్పకళని, సమర్థవంతంగా అర్థవంతంగా, చక్కగా బోధించే ఉపాధ్యాయులను విద్యార్థులు కలకాలం గుర్తుంచుకుంటారని ఎంఈఓ పేర్కొన్నారు.