Divitimedia
Andhra PradeshBusinessFarmingLife StyleSpot News

జామాయిల్ నర్సరీల వాహనాలటోల్ గేట్ హక్కుల వేలం

జామాయిల్ నర్సరీల వాహనాల
టోల్ గేట్ హక్కుల వేలం

✍️ కుక్కునూరు – దివిటీ (జులై 14)

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు కుక్కునూరు మండలంలోని పెదరావిగూడెం, గణపవరం, తొండిపాక గ్రామ పంచాయితీ పరిధిలో జమాయిల్ నర్సరీలకు వచ్చి వెళ్లే వాహనాల టోల్ గేట్ నిర్వహణ హక్కుల వేలంపాట సోమవారం నిర్వహించారు. ఈ మూడు పంచాయతీల్లో నర్సరీలు అత్యధికంగా ఉండడం వల్ల డీపీఓ, డీఎల్పీఓ ఆదేశాల ప్రకారం పంచాయతీల అభివృద్ధి కోసం “టోల్ గేట్” ఏర్పాటుచేసి రుసుములు వసూళ్లు చేస్తున్నారు. మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఈ టోల్ గేట్ నిర్వహణ హక్కులకు నిర్వహించిన బహిరంగ వేలంలో 17 మంది డిపాజిట్ దారులు పాల్గొని పోటీపడ్డారు. చిన్న చిన్న వివాదాల నడుమ గడ్డం సుమన్ అనే వ్యక్తి రూ.4.80 లక్షలకు ఈ టోల్ గేట్ హక్కులు దక్కించుకున్నారు. ఈ టోల్ గేట్ లో వాహనాల చార్జీలను ఐషర్ వాహనానికి రూ.200, లైలాండ్ వాహనానికి రూ.100, టాటా ఏస్ వాహనానికి రూ.50, వర్మీ కంపోస్ట్ రవాణా వాహనానికి రూ.200, ప్లాస్టిక్ ట్రేల రవాణా వాహనానికి రూ.100, మొక్కల ప్యాకేజి వాహనానికి రూ.200 గా నిర్ణయించారు. ఈ టోల్ వసూళ్లకు హక్కులు దక్కించుకున్నవారు ఈ జులై 14 నుంచి 2026 జులై 14 వరకు (ఒక ఏడాదిపాటు) వాహనాల రుసుములు వసూళ్లు చేసుకోవచ్చని, పంచాయితీ అధికారుల అనుమతితో తీసుకోవాలని, అధిక ధరలు తీసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సర్పంచులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెదరావిగూడెం సర్పంచ్ కుంజా వెంకటమ్మ, గణపవరం సర్పంచ్ నరేష్, తొండిపాక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు గాడిద రామచంద్రం, గణపవరం ఉప సర్పంచ్ ఎల్లంకి లచ్చు, పెదరావిగూడెం 8వ వార్డు మెంబర్ గాడిద వెంకటేశ్వర్లు, గాడిద రాంబాబు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

కార్యకర్తలకు వెన్నంటే ఉంటా : వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్

Divitimedia

రానున్న 48గంటల్లో ఈదురుగాలులతో వర్షాలు

Divitimedia

రెండు కార్లలో 21 కేజీల గంజాయిని స్వాధీనం

Divitimedia

Leave a Comment