నేడు శ్రీకట్ట మైసమ్మతల్లి జాతర
✍️ సారపాక – దివిటీ (మే 11)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని సుందరయ్యనగర్ లో సోమవారం ‘శ్రీ కట్టమైసమ్మతల్లి జాతర వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త (నిర్వాహకురాలు) అనంతలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుందరయ్యనగర్లో పూజలందుకుంటున్న
గ్రామ దేవత శ్రీ కట్టమైసమ్మతల్లి ఆలయంలో స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ పౌర్ణమి (మే 12) సోమవారం జాతర మహోత్సవం నిర్వహించేందుకు దైవజ్ఞులచే నిర్ణయించబడినట్లు ఆమె తెలిపారు. కట్టమైసమ్మతల్లి జాతరలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు, కృపాకటాక్షములు పొందాలని కోరారు. కట్టమైసమ్మతల్లి జాతరలో జంతుబలి నిషేధించామని, భక్తులు గమనించాలని కోరారు. జాతరలో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులు తమ మొక్కులు చెల్లించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ సందర్భంగా భక్తుల సహాయ సహకారాలతో మధ్యాహ్నం 12గంటలకు అన్నసంతర్పణ (అన్నదానం) చేస్తున్నట్లు అనంతలక్ష్మి పేర్కొన్నారు.