‘ఆర్సీఓ’గా బాధ్యతలు చేపట్టిన అరుణకుమారి
✍️ భద్రాచలం – దివిటీ (మే 2)
ఖమ్మం రీజినల్ గురుకుల సమన్వయ అధికారిణి(ఆర్సీఓ)గా అరుణకుమారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఐటీడీఏ కార్యాలయంలో ఇప్పటి వరకు గురుకులం ఆర్సీఓగా పనిచేసిన నాగార్జునరావు మేడ్చల్ రంగారెడ్డి ఆర్సీఓగా బదిలీ అయి విధుల నుంచి విడుదలై అరుణకుమారికి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్సీఓ అరుణకుమారి, బదిలీ అయిన ఆర్సీఓ నాగార్జునరావు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) డేవిడ్ రాజును వారి వారి ఛాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీఓ రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజు వారిద్దరిని అభినందించారు.