Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelanganaYouth

ఆదివాసీలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలే లక్ష్యం

ఆదివాసీలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలే లక్ష్యం

పూసుగుప్ప- చత్తీస్ గడ్ సరిహద్దు బీటీ రోడ్డు సందర్శించిన జిల్లా ఎస్పీ

✍️ చర్ల, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఏప్రిల్ 17)

చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామం నుంచి చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దు వరకు నిర్మాణ పనులు పూర్తైన 2 కిలోమీటర్ల బీటి రోడ్డును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం సందర్శించారు. చర్ల నుంచి ద్విచక్ర వాహనాలపై పర్యటించి పూసుగుప్ప వరకు పూర్తయిన, నిర్మాణంలో ఉన్న కాజ్ వేలు, కల్వర్టులను పరిశీలించారు. పూసుగుప్ప నుంచి ఇటీవల పూర్తయిన రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డును ఎస్పీ పరిశీలించారు. దాదాపు రూ.3 కోట్లతో పూసుగుప్ప నుంచి చత్తీస్ గడ్ రాష్ట్రం లోని రాంపురం, భీమారం గ్రామాలలోని ఆదివాసీలకు ఉపయోగపడేలా ఈ రోడ్డు నిర్మించినట్లు ఎస్పీ తెలిపారు. నిషేధిత మావోయిస్టులు ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ద్వారా వారికి విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే పూసుగుప్ప, చెన్నాపురం గ్రామాల్లో దాదాపుగా పూర్తయిన మొబైల్ హాస్పిటళ్లను ప్రారంభించనున్నట్లు ఎస్పీ తెబిపారు. ఆదివాసీలకు ఉపయోగపడే ఏ అభివృద్ధి కార్యక్రమాన్నైనా ముందుండి పూర్తి చేయడానికి పోలీసు శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పాలసీకి ఆకర్షితులై మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ క్యాడర్లకు చెందిన చాలామంది ఇప్పటికే లొంగిపోయారని, మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మిగిలిన నాయకులు, సభ్యులు కూడా లొంగిపోయి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఆత్మహత్యకు యత్నించిన వృద్ధురాలిని కాపాడిన బ్లూకోల్ట్స్ పోలీసులు

Divitimedia

ప్రజాపాలనతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

Divitimedia

పినపాక నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన

Divitimedia

Leave a Comment