Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelanganaWomen

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు

న్యాయ, పోలీసు అధికారులను అభినందించిన ఎస్పీ

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఏప్రిల్ 10)

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు వెల్లడించారు. న్యాయ, పోలీసు అధికారులు తెలిపిన ఆ కేసు వివరాలిలా ఉన్నాయి. ఇల్లందు మండలం తంగెళ్లగడ్డకు చెందిన భూక్యా నాగేశ్వరరావు అలియాస్ నగేష్ తన బంధువు కుమార్తెలయిన ఆరు, నాలుగు సంవత్సరాల అక్కచెల్లెల్లిద్దరినీ చాక్లెట్ ఇస్తానని చెప్పి 2024 జులై 4వ తేదీన తేదీన తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. వారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు నాగేశ్వరరావు, వారి అరుపులకు పారి పోయాడు. ఈ విషయంపై ఆ బాలికల తండ్రి జూలై 5న ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ కేసు నమోదు చేశారు. అప్పుటి ఇల్లందు ఇన్చార్జి డీఎస్పీగా వ్యవహారిస్తున్న కొత్తగూడెం డీఎస్పీ ఎస్కే.అబ్దుల్ రెహమాన్ కేసు విచారణ చేపట్టారు. తర్వాత ఇల్లందు డీఎస్పీ చంద్రబాను ధర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాసెక్యూషన్ తరఫున కోర్టులో 15మంది సాక్షులను విచారించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయ మూర్తి, నిందితుడైన భూక్యా నాగేష్ @ నాగేశ్వరరావుపై నేరం రుజువైనందున అతనికి జీవిత ఖైదుతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి శిక్షపడే విధంగా కృషిచేసిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, ఇల్లందు సీఐ సత్యనారాయణ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి, భరోసా సెంటర్ కొత్తగూడెం లీగల్ ఆఫీసర్ గద్దాడ శిరీష, కోర్ట్ నోడల్ ఆఫీసర్ ఎస్సై జి.ప్రవీణ్ కుమార్, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్కే అబ్దుల్ ఘని, కోర్టు డ్యూటీ ఆఫీసర్ తాళ్లూరి శ్రీనివాసరావులను గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

ప్రతి ఇంటికి త్రాగునీరందేలా చర్యలు తీసుకోవాలి

Divitimedia

నిద్రపోయి’… నిండా ‘ముంచారు’…

Divitimedia

వలస ఆదివాసీలకు ప్రత్యేక చికిత్సలు

Divitimedia

Leave a Comment