ప్రైవేటు సంస్థల్లో 45 ఉద్యోగావకాశాలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఏప్రిల్ 8)
హైదరాబాదు, భద్రాద్రి కొత్తగూడెంలలోని రెండు ప్రైవేటు సంస్థల్లో మొత్తం 45 ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నందున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాదు నగరంలోని KPR Developers PVT LTD బ్రాంచ్ లో పనిచేసేందుకు 25, కొత్తగూడెంలో Mutoot Microfin లో 20 ఉద్యోగాలు ఖాళీలున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఉపాదికల్పనశాఖ ఆధ్వర్యంలో ఈనెల 10న పాల్వంచలో గవర్నమెంట్ డిగ్రీకళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 20 నుంచి 28 సంవత్సరాల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 10గంటల నుంచే ఇంటర్వ్యూ కోసం సర్టిఫికేట్స్ జిరాక్సులతో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.