తెదేపా సభ్యత్వాల్లో ‘పినపాక’కు రాష్ట్రంలో మూడోస్థానం
✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 29)
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన TDP సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన 3వ అసెంబ్లీ నియోజకవర్గంగా ఘనత సాధించింది. ఈ ఘనత సాధించేందుకు కృషిచేసిన నియోజకవర్గం పరిధిలోని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అడహాక్ కమిటీ సభ్యులను పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సారపాకలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ అడహక్ కమిటీ సభ్యుడు, TNTUC రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోటు రంగారావు ఘనంగా సన్మానించారు. త్వరలో నియామకం జరిగే గ్రామ, మండలస్థాయి కమిటీలకు నాయకులను సమాయత్తం కావాలని సూచించారు. ఈ సందర్భంగా 3596 సభ్యత్వాలు చేసి రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచిన రంగారావును పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందించారు.