ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవాలు

✍️ బూర్గంపాడు- దివిటీ (మార్చి 29)
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో TDP, ITC పేపర్ బోర్డ్స్ TNTUC ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. మండలం పరిధిలో అన్నిగ్రామాల్లో దివంగత NTR విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీ జెండాలు ఎగురవేశారు. కార్యక్రమాల్లో TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి జగదీశ్వరరావు, జిల్లా నాయకులు గల్లా నాగభూషయ్య, చావ మహేశ్వరరావు, మైనార్టీ నాయకుడు అజీజ్, సీనియర్ నాయకులు కంచేటి వెంకటేశ్వరరావు, కాకర్ల సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షుడు నెట్టెం భాస్కర్, ITC TNTUC అధ్యక్షుడు కనకమెడల హరిప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కరి రాజేంద్రప్రసాద్, కార్యవర్గ సభ్యులు చావ రవి, బి.వి. సుబ్బారావు, పిడుగు కొండలరావు, పోటు నరేష్, కుందేటి శ్రీనివాస్, సాయి బాబు, నరసింహారావు, పలువురు TDP, TNTUC నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

