Divitimedia
Bhadradri KothagudemEntertainmentLife StylePoliticsSpot NewsTelanganaTravel And TourismYouth

ఎమ్మెల్యే పాయంకు మేడారం ట్రస్టుబోర్డు ఆహ్వానం

ఎమ్మెల్యే పాయంకు మేడారం ట్రస్టుబోర్డు ఆహ్వానం

✍️ మణుగూరు – దివిటీ (మార్చి 3)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామంలో ఈనెల 5, 6వ తేదీల్లో జరుగనున్న శ్రీ పగిడిద్దరాజు జాతరకు హాజరు కావాలని కోరుతూ, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ అరెం లచ్చుపటేల్, జాతర కమిటీ సభ్యులు సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆహ్వానించారు. ఈ మేరకు మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ లో వారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి ఆహ్వానం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షుడు పిరినకి నవీన్, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
——————-
ముసలమ్మ జాతరకు ఆహ్వానించిన దేవస్థానం కమిటీ
——————–

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాల గ్రామంలో ఈనెల 11 నుంచి 13 వరకు జరుగనున్న శ్రీముసలమ్మ జాతరకు హాజరు కావాలని ముసలమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆహ్వానించారు. సోమవారం ఎమ్మెల్యేను
మణుగూరు క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ లో కలిసి ఆహ్వానం అందించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ముసలమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనమహోత్సవ లక్ష్యాలు సాధించాలి

Divitimedia

మహిళల రక్షణే షీటీమ్స్ ప్రధాన లక్ష్యం : ఎస్పీ డా.వినీత్

Divitimedia

కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Divitimedia

Leave a Comment