Divitimedia
AMARAVATHIAndhra PradeshBhadradri KothagudemCrime NewsHealthHyderabadLife StyleMahabubabadNational NewsPolitics

మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

✍️ ఖమ్మం – దివిటీ (జనవరి 12)

తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆదివారం పెనుప్రమాదం తప్పింది. మంత్రి వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా, తిరుమలాయపాలెం వద్ఒకేసారి కారు రెండు టైర్లు పేలడంతో, కారు కంట్రోల్ తప్పింది. కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో మంత్రి శ్రీనివాసరెడ్డికి ముప్పు తప్పింది. ఆయన కారు ప్రమాదానికి గురికావడంతో, మంత్రి ఎస్కార్ట్ కారులో ఖమ్మం చేరారు. ప్రమాదం సమయంలో పొంగులేటితో పాటు ఆ కారులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య, తదితరులు కూడా ఉన్నారు. మంత్రితో సహా ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

ముంపు బాధిత గ్రామాలను కాపాడాలని ధర్నా

Divitimedia

రామవరం హైస్కూల్లో ‘ఉత్తమ భవిష్యత్తు’ అవగాహన కార్యక్రమం

Divitimedia

గ్రూప్-2 పరీక్షా కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎస్పీ

Divitimedia

Leave a Comment